మా స్నేహితుడు ఒకడు పై చదువుకోసమని మదరాసు వెళ్ళాడు(పది-పదిహేను సంవత్సరాలక్రితం మాట). తన స్నేహితులను అరవ మురుగేశన్, అరవ ప్రభాకరన్ అని పిలుచుకునేవాడు. అది విన్న ఒక తమిళతను ఒక పెద్ద గుంపుతో వచ్చి మనవాణ్ణి చితకబాదాడు. పాపం వీడికేం తెలుసు అర(సగం) వ(భాష) అంటే తెలుగువారు తమిళులను హేళనగా పిలుచుకునే పదమని. మనకు ముప్ఫై ఏడుకు పైచిలుకు హల్లులుంటే వారికి సగం అంటే పద్దెనిమిది హల్లులు మాత్రమే ఉన్నందున, వారిది సగం భాషగా కొందరు మూర్ఖ పూర్వీకులు వారిని అవహేళన చేసేవారు. కానీ ఇప్పుడు మన భాషకూడా అరవై నుండి నలభైకి పడిపోయి అరవ భాషగా మారిపోతూ వస్తోంది. అక్షరాలెన్నైతే ఏంటి, భావం ముఖ్యం గాని అనే ఛాందసులూ లేకపోలేదు, కాకపోతే వారికోసం ఈ చర్చను వేరే గతంలో మొదలుపెడతాను. ఇంతకూ ఈ గతానికొస్తే మా వాడికి దెబ్బలు తిన్న మరుక్షణమే ఒక ధర్మ సందేహం వచ్చింది. వాళ్ళను ఇలా హేళన చేస్తున్నాం కదా, మరి వాళ్ళు కూడా ఏదో పేరుతో మనను హేళన చెయ్యకపోరు. మరి ఆ పదం ఏమయ్యుంటుంది..ఎలా తెలుసుకోవడం అని తీవ్ర పరిశోధన చేసి చివరికి ఒక పదమైతే తెలుసుకున్నాడు.
తమిళులు అరవలైతే ...... అంధ్రులు గుల్టీలు/గుల్తీలు (Telugu in reverse) అని....
(కేవలం సమాచార నిమిత్తమే గానీ ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశం కాదని మనవి.)
తమిళులు అరవలైతే ...... అంధ్రులు గుల్టీలు/గుల్తీలు (Telugu in reverse) అని....
(కేవలం సమాచార నిమిత్తమే గానీ ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశం కాదని మనవి.)