ఒకప్పుడు భాషా పండితులకు ఇతర భాషలమీద కూడా పరిఙానం ఉండాలనే ఉద్దేశ్యంతో మన ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. పరాయిరాష్త్రం వెళ్ళి ఒక సంవత్సరం పాటు ఒక పరాయి భాషను నేర్చుకోవాలని( ఆ సంవత్సరం పాటు జీతం ఇస్తూ, పాఠాలను బోధించే ఉత్తమ అధ్యాపకులను కూడా నియమించేది. గొప్ప నిర్ణయం కదూ!!!). దీనిలో భాగంగా మా నాన్నగారు కూడా మైసూరు వెళ్ళి తమిళభాషను ఎంచుకున్నారు. ఒకరోజు ఒక తమిళ అధ్యాపకులు పాఠ్యాంశంలో భాగంగా తమిళ భాష గొప్పతనాన్ని వర్ణిస్తూ zha అక్షరం ద్రావిడభాషల్లోనే గొప్పదని, అది భాషకు వన్నె తెస్తుందని తమిళ, మలయాళ భాషల్లో తప్ప మరేయితర ద్రావిడ భాషల్లో లేదని వ్యంగంగా తెలుగుని కించపరుస్తూ మాట్లాడుతున్నారుట. ఇంతలో మా నాన్నగారు లేచి ఈ అక్షరం తెలుగులో కూడా ఉందని, నన్నయ్య తన భారత రచనలో వాడారని, ఒక పద్యాన్ని ఉదాహరణగా జోడించారట. అది విన్న తోటి తెలుగువారు హేళన చేస్తూ చాదస్తపు పంతులు సంస్కృతాక్షరానికి భష్టరూపం ఇచ్చి, ఎదో మాట్లాడుతున్నారని అది నిజం కాదని వాదన వేసుకున్నారట. ఆ అధ్యాపకులవారు తరువాతి రోజు తరగతి గదిలోకి వచ్చి, తను గ్రంథాలయంలో నిన్న చెప్పిన పద్యం గురించి శోధించానని, అది నిజమేనని, ఈ అక్షరం అన్ని ద్రావిడ భాషలలో ఉండవచ్చునని తప్పుని మన్నించమని క్షమాపణ చెప్పారట. నాకైతే భలే వింతగా అనిపించిందీ సంఘటన. ఎందుకంటే ఈ మధ్యే ఒక పెద్దాయన తెలుగులో ఒక ముప్పైకి పైగా అక్షరాలు వ్యర్థమని కేవలం తమ భాషకు 25 అక్షరాలు సరిపోతాయని వింత ప్రచారాలు చేస్తున్నారు ఆ సంగతులను నా తరువాతి బ్లాగులో చర్చిస్తాను. సెలవా మరి!!!
No comments:
Post a Comment