శీర్షిక వింతగా ఉంది కదూ. నిన్న శుక్రవారం కదా మా ఉద్యోగుల మాటా బంతీ జరిగినప్పుడు ఒక మరాఠా ఆవిడకు తమిళులంటే మా చెడ్డ కోపమనీ, వాళ్ళు ఎప్పుడూ తమిళంలో మాట్లాడుకుంటారనీ, సాంబారు తింటారని అన్నీ వింత వింతగా చెబుతూ ఉంది. ఏదో నేనున్నాని తెలుగు వారిగురించి వింతగా చెఉప్పలేదేమో అనిపించింది నాకు. ఇంతలో తనదొక ధర్మ సందేహం. మీ దక్షినాది వారంత ఎందుకు త ని tha అని రాస్తారు అని. నాకైతే మా చెడ్డ కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా దక్షినాది వారు, వాళ్ళ భాష, వాళ్ళ తిండి, ఇంకో యావే లేదాయె.
ఇంతకీ వాదనకొస్తే లత, లలిత, సంగీత వంటి పేర్లలో మనం ఎక్కువగా tha వాడుతాం. ఉత్తరాదీయులు ta వాడుతారు. మీకెందుకు H అంటే అంత మక్కువ వ్యంగ్యంగా అడిగింది, క్రిందటి 'హెచ్చు ' వాదనను గుర్తు చేస్తూ. నేనేమీ ఊరకే ఉండకుండా ఇంక నా వాదనను అందుకున్నాను. వాళ్ళెందుకు అలా ta వాడుతారు, మరి 'త ' ని ఎలా వ్రాస్తారని అడిగితే ఆంగ్ల భాషలో రెండు లేవు కాబట్టి రెంటికీ ఒహటే వాడినా తప్పు లేదుట. నాకు భల్లున నవ్వొచ్చేసింది. కొంచెం ప్రాంతీయవాదన ప్రక్కన పెట్టి ఆలోచించమని నాకు తోచిన వాదనతో సమర్దించాను tha ప్రయోగాన్ని. భారతీయ భాషల్లో త, థ, ట మరియు ఠ అని నాలుగు అక్షరాలు ఉన్నాయి. అదే ఆంగ్ల భాషలో ta, tha అని రెండు అక్షరాలే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ రెంటికీ ఒకే అక్షరం వాడాల్సి వచ్చినప్పుడు రెండు తరచుగా వాడే అక్షరాలని ఒకే అక్షరంతో సూచించడం కన్నా రెండు వేరు వేరు అక్షరాలతో ఉపయోగించడం సులువు కదా అని. మరి ఠ ని ఎలా వ్రాస్తారు, థ ని ఎలా రాసారు. త, థ, ఠ మూదింటికీ tha వాడటం ఏమి న్యాయం, థ కి ta వాడతారా మరి అంటు వ్యంగ్యస్త్రాలని అందుకుంది. నాకు ఏనుగు లక్షమణ కవి తెనిగించిన ఒక సుభాషితం గుర్తొచ్చి చల్లగా అక్కడినుండి జారుకున్నాను.
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
No comments:
Post a Comment